తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కుదిరినట్లు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తెలిపారు. పొత్తులో భాగంగా కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీ చేస్తుందని చెప్పారు. కొత్తగూడెంలో సీపీఐ విజయానికి కాంగ్రెస్‌ కృషి చేస్తుందన్నారు. సోమవారం హైదరాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి రేవంత్‌రెడ్డి వెళ్లారు. అక్కడ సీపీఐ నేతలతో రేవంత్‌ చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐకి ఇస్తామన్నారు. ఈ ఎన్నికల్లో పెద్దమనసుతో సహకరించాలని సీపీఐని కోరినట్లు చెప్పారు. కాంగ్రెస్‌-సీపీఐ సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సీపీఎం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ వారితో కూడా పొత్తు విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

Revanth Reddy TPCC (Photo-Video Grab)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)