తెలంగాణ లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత జితేందర్ ఇంటికి వెళ్లారు.రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జితేందర్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం ఆశించగా హైకమాండ్ తేందర్ రెడ్డిని కాదని డీకే అరుణకు అవకాశం కల్పించింది.ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు.
ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ మా ఇంటికి రావడం కొత్తేమీ కాదు. తన అన్న ఇంటికి వచ్చాడు అంతే. మాది ఒక్కటే జిల్లా. నాకు సీటు రాలేదని ఓదర్చాడానికే వచ్చాడు. నేను ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నాను. బీజేపీలో సంతోషంగానే ఉన్నాను. నా సీటు గురించి అధిష్టానం చూసుకుటుంది. పార్టీలోకి సీఎం రేవంత్ నన్ను ఆహ్వానించలేదు. నేను కూడా ఏమీ మాట్లాడలేదు. కేవలం పరామర్శ కోసమే రేవంత్ మా ఇంటికి వచ్చాడు అని అన్నారు. కాంగ్రెస్‌లో టికెట్లు ఫుల్ ఫిల్ అయ్యాయి. మహబూబ్‌నగర్‌లో వంశీ, చేవెళ్లలో పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌కు ఉన్నారని తెలిపారు.
Here's Video
Jithendar Reddy: సానుభూతి వ్యక్తం చేయడానికే సీఎం రేవంత్ కలిశారు: భాజపా నేత జితేందర్ రెడ్డి#JithendarReddy #BJP #CMRevanthReddy #TelanganaNews #TeluguNews pic.twitter.com/kRYJZSQyu0
— Eenadu (@eenadulivenews) March 14, 2024
జితేందర్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి #jithender #cmrevanthreddy #revanthreddy #inc #tcongress #telanganacongress pic.twitter.com/F7fFUJW2oJ
— News 360 Telugu (@News360Telugu) March 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)