కాంగ్రెస్ సీనియర్ నేత కే కేశవరావు ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో తీవ్ర భావోద్వేగానికి లోనై.. కన్నీళ్లు పెట్టుకున్నారు.కేకేకు రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించామని, పార్టీలో కేసీఆర్ తర్వాత స్థానం ఆయనకే ఇచ్చి గౌరవించామని, ఆయన కూతురిని హైదరాబాద్‌లాంటి మహానగరానికి మేయర్‌ను చేశామని.. కుమారున్ని కమిషన్ ఛైర్మన్‌గా నియమించామని.. అయినప్పటికీ ఆయన బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారని కేటీఆర్ అన్న మాటలకు ఆయన ఎమోషన్ అయ్యారు. కేటీఆర్‌ కూడా తన కొడుకు లాంటి వాడేనని.. ఆయన అన్న మాటలకు ఏడుపు ఒకటే తక్కువ అని కేకే భావోద్వేగానికి లోనయ్యారు. బీఆర్ఎస్‌లో సీనియర్ అనేగానీ అసలు ఎలాంటి గుర్తింపు లేదని భోరుమన్నారు. పార్టీ మారినందుకు నా చిన్న కొడుకు ఉగాది రోజున పెట్టిన మెజేస్ చూసి కళ్ల నీళ్లు ఆపుకోలేకపోయానని అన్నారు. వ‌రంగ‌ల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్ధి ఖ‌రారు, ఉద్య‌మ‌కారుడికే అవ‌కాశ‌మిచ్చిన కేసీఆర్

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)