పార్లమెంట్‌ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకున్నాయి. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్‌ జెడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో జాయిన్‌ అయ్యారు. వీరితో పాటు జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఆయన సతీమణి చర్లపల్లి కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి, ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ తెలంగాణ ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా మున్షీ వీరికి హస్తం కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం నేతలంతా అసెంబ్లీకి వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.

Here's Pics

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)