ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. దర్యాప్తు తర్వాత ప్రమాద కారణాలు తెలుస్తాయని తెలిపారు. మంటల్లో 7 బోగీలు దగ్ధమయ్యాయని చెప్పారు. మిగతా 11 బోగీలతో సికింద్రాబాద్‌కు రైలును తరలించామని పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని అరుణ్‌కుమార్ పరిశీలించారు.
మరోవైపు ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై డీజీపీ అంజనీ కుమార్ ట్వీట్ చేశారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. ప్రమాదానికి కారణాలను విశ్లేషిస్తున్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాలిపోయిన బోగీల్లోని ప్రయాణికులను బస్సుల్లో తరలించామని తెలిపారు.
Heres' DGP Tweet
All passengers are safely evacuated and shifted in buses after a fire broke out in the Falaknuma Express near Bhongir rural PS limits. Police, Fire Dept, and Railways are working in coordination. So far, no fatalities have been reported.
Out of 18 coaches 11 are detached and… pic.twitter.com/TtgD5BzFP6
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 7, 2023
(SocialLY brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user's social media account and LatestLY Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of LatestLY, also LatestLY does not assume any responsibility or liability for the same.)