తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ కు భారీగా వరద చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో.. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి (700 అడుగులు) చేరుకుంది. ప్రస్తుతం ఎగువ నుంచి ప్రాజెక్ట్‌లోకి 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. 14 వరద గేట్ల ద్వారా 2.4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

అయితే, ప్రాజెక్టుకు మొత్తంగా 18 వరద గేట్లు ఉండగా.. అందులో నాలుగు గేట్లు తెరుచుకుకోకుండా ఇంకా మొరాయిస్తున్నాయి. ప్రస్తుతం 14 గేట్ల ద్వారా వాటికి తగ్గ నీటిని వదులుతున్నా.. వచ్చే వరద నీరు ఇదే పరిస్థితిలో కొనసాగితే ముప్పు తప్పదన్న భావన స్థానికుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను సంబంధిత అధికారులు అప్రమత్తం చేశారు.

Kadem Project (photo-Video Grab)

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)