జీఎంఎం ఫాడుల‌ర్ సంస్థ హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చింది. గ్లాస్ లైన్ ప‌రిక‌రాల త‌యారీకి విస్త‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను ప్ర‌క‌టించింది. త‌యారీ కేంద్రంపై మ‌రో 37 ల‌క్ష‌ల డాల‌ర్ల పెట్టుబ‌డి పెట్ట‌నుంది. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో స‌మావేశం అనంత‌రం కంపెనీ ఈ ప్ర‌క‌ట‌న చేసింది. హైద‌రాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టులో భాగ‌స్వామిగా సంస్థ ఉంటాన‌ని ప్ర‌క‌టించింది. 2020 ఏడాదిలో తెలంగాణ‌లో జీఎంఎం ఫాడుల‌ర్ త‌న కంపెనీని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. గ్లాస్ లైనింగ్ ఈక్విప్‌మెంట్ త‌యారీ రంగంలో 6.3 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డి పెట్టింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)