నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ లచ్చునాయక్‌ రూ.3 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బాధితుల వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఔషధాల టెండర్‌ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి ఈ మొత్తాన్ని డిమాండ్‌ చేశారు. దీంతో, సదరు బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.

ఈ క్రమంలో శుక్రవారం ఆయన నివాసంలో వెంకన్న నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. రెడ్‌హ్యాం​డెడ్‌గా అధికారిని పట్టుకున్నారు. అయితే, ప్రభుత్వ ఆసుపత్రికి రెండేళ్లుగా ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు వెంకన్న తెలిపారు. కొన్నాళ్లుగా సూపరింటెండెంట్‌ 10 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారని, ఇటీవల అధికశాతం కావాలని డిమాండ్‌ చేసినట్లు వెల్లడించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)