తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకంపై ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 35 మంది ఛైర్మన్లను నియమిస్తూ జీవో విడుదల చేశారు. మార్చి 15నే ఇందుకు సంబంధించి జీవో విడుదలైంది. అయితే, ఎన్నికల కోడ్‌ దృష్ట్యా ఆపి ఈరోజు తిరిగి విడుదల చేశారు. రెండు రోజుల్లో కార్పొరేషన్‌ ఛైర్మన్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఛైర్మన్లుగా నియమితులైనవారు రెండేళ్ల పాటు పదవుల్లో కొనసాగనున్నారు.

కార్పొరేషన్ల ఛైర్మన్లు:

హౌసింగ్ కార్పొరేషన్ - ఆర్. గురునాథ్ రెడ్డి

ఆర్యవైశ్య కార్పొరేషన్ - కాల్ప సుజాత

గ్రంథాలయ పరిషత్ - ఎండీ రియాజ్

ఫారెస్ట్ డెవలప్ మెంట్ - పోడెం వీరయ్య

స్టేట్ ఎంప్లాయ్ మెంట్ ప్రమోషన్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్ - ఎన్. గిరిధర్ రెడ్డి

మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డ్ - జనక్ ప్రసాద్

ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - ఎం. విజయబాబు

అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్ - చల్లా నరసింహారెడ్డి

శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - కె. నరేందర్ రెడ్డి

కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - ఇ. వెంకట్రామిరెడ్డి

హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ - నాయుడు సత్యనారాయణ

మైనారిటీస్ కార్పొరేషన్ - ఎం.ఏ. జబ్బార్

రోడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - రాంరెడ్డి మల్రెడ్డి

మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - అనిల్ ఎరావత్

ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ - ఐతా ప్రకాశ్ రెడ్డి

పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ - నిర్మల జగ్గారెడ్డి (జగ్గారెడ్డి భార్య)

బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ - నూతి శ్రీకాంత్

రాష్ట్ర సాంకేతిక సేవల అభివృద్ధి కార్పొరేషన్ - మన్నె సతీశ్ కుమార్

ఎస్సీ కార్పొరేషన్ - ఎన్. ప్రీతమ్

షెడ్యూల్డ్ ట్రైబ్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - బెల్లయ్య నాయక్

గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - కె. తిరుపతి

మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - జె. జైపాల్

టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ - పటేల్ రమేశ్ రెడ్డి

ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - బంద్రు శోభారాణి

ఫుడ్ కార్పొరేషన్ - ఎం.ఏ. ఫహీం

సంగీత నాట్య అకాడెమీ - అలేఖ్య పుంజల

తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ - కె. శివసేనా రెడ్డి

వికలాంగుల కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - ఎం. వీరయ్య

విత్తనాల అభివృద్ధి సంస్థ - ఎస్. అన్వేష్ రెడ్డి

వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ - కాసుల బాలరాజు

కోఆపరేటివ్ యూనియన్ - మనాల మోహన్ రెడ్డి

ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ - జ్ఞానేశ్వర్ ముదిరాజ్

రాష్ట్ర సహకార ఆయిల్ సీడ్స్ ఉత్పత్తిదారుల ఛైర్మన్ - జంగా రాఘవరెడ్డి

స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ - రాయల నాగేశ్వరరావు

రాష్ట్ర మత్స్య సహకార సంఘం ఛైర్మన్ - మెట్టు సాయి కుమార్.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)