తెలంగాణలో నేటి నుంచి కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ అందించాలని తాజాగా రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ, కార్యాలయాలు, కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ అమలు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్ మార్గదర్శకాలు పాటిస్తూ ముందస్తుగా కొవిన్ పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వొచ్చని కేంద్రం ప్రకటించింది. అయితే టీకాల కొరతతో చాలా రాష్ట్రాలు 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇంకా 45 ఏళ్లకు పైబడినవారికి రెండో డోస్ ఇచ్చే కార్యక్రమాలే కొనసాగుతున్నాయి.
Here's Update
The #Telangana government on Tuesday permitted all the designated private hospitals in the state to start administration of #COVID19vaccines to people above 18 years. pic.twitter.com/bDr4TnSHIh
— IANS Tweets (@ians_india) May 25, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)