అర్హులైనవారికి రూ 500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం గైడ్‌లైన్స్‌ను రేవంత్ సర్కారు విడుదల చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ‘మహాలక్ష్మి’లో మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది.

తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం జీవోల స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, అందులో రేషన్‌కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలుగా ఉంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తెల్లరేషన్‌కార్డు దారులకు రూ.500కే సిలిండర్‌ ఇవ్వనున్నారు. గ్యాస్‌ కంపెనీలకు నెలవారీగా సబ్సిడీ ప్రభుత్వం చెల్లిస్తుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బును గ్యాస్‌ కంపెనీలు బదిలీ చేయనున్నాయి. మూడేళ్ల సరాసరి వినియోగం ఆధారంగా సిలిండర్లు ఇవ్వనున్నారు. మహిళ పేరుపై గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నవారికి మహాలక్ష్మి పథకం వర్తించనుంది.

Here's Guidelines

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)