హైద‌రాబాద్‌లోని కొండాపూర్ ఏరియా ఆస్ప‌త్రిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. ఆసుపత్రిలోని ఓ వైద్యుడి లంచావతారంపై కొందరు మంత్రికి ఫిర్యాదు చేశారు. దాంతో ఆసుపత్రికి వెళ్లిన హరీశ్ రావు... వైద్యుడి అవినీతిని గుర్తించి అతడిని అక్కడిక్కడే సస్పెండ్ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ కోసం ఆ డాక్టర్ లంచం అడుగుతుండడంతో మంత్రి పైవిధంగా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు, ఇతర సిబ్బంది కూడా జాగ్రత్తగా ఉండాలని, లంచాలు, అవినీతి జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అంతా కలియదిరిగిన హరీశ్ రావు రోగులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.

గైన‌కాల‌జీ వార్డును కూడా మంత్రి హ‌రీశ్‌రావు ప‌రిశీలించారు. గైన‌కాల‌జీ వార్డుల్లో నిత్యం స్కానింగ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌న్నారు. ఇందుకు అద‌నంగా మ‌రో రెండు అల్ట్రా సౌండ్ యంత్రాలు పంపుతామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. 60 శాతానికి పైగా సాధార‌ణ డెలివ‌రీలు కావ‌డం ప‌ట్ల మంత్రి సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ సంఖ్య‌ను మ‌రింత పెంచాల‌ని హ‌రీశ్‌రావు సూచించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)