టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ రెండోసారి క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని, దాంతో పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని మంత్రి తెలిపారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని, జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కేటీఆర్ సూచించారు. 2021, ఏప్రిల్ 23న మంత్రి కేటీఆర్ క‌రోనా బారిన ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ తాజాగా ఆయ‌న మ‌రోసారి క‌రోనా బారిన ప‌డ్డారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)