మొన్నటిదాకా మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. మరికాసేపట్లో బీజేపీలో చేరిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరబోతున్న తరుణంలో ఆదివారం ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను పోస్ట్ చేశారు. మునుగోడు సభకు వస్తున్న అమిత్ షాకు స్వాగతం చెబుతూ కోమటిరెడ్డి ఆ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ల ఫొటోలను అమర్చిన కోమటిరెడ్డి...కింద తన బొమ్మను ఏర్పాటు చేశారు. వెరసి బీజేపీ పోస్టర్‌పై కోమటిరెడ్డి తొలిసారిగా తన ఫొటోను ముద్రించారు.
I heartily welcome Hon'ble @HMOIndia Sri @AmitShah ji to #MunugoduAthmaGauravaSabha
నేడు మునుగోడు ఆత్మ గౌరవ సభ కు రానున్న కేంద్ర హోం మంత్రి శ్రీ @AmitShahOffice గారికీ స్వాగతం - సుస్వాగతం 🙏 pic.twitter.com/h1E8qtOSyI
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) August 21, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)