Covid in Telangana: తెలంగాణలో కొత్తగా 1,362 కరోనా కేసులు, 10మంది మృతి, జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 145 కేసులు, రాష్ట్రంలో ప్రస్తుతం 18,568 యాక్టివ్‌ కేసులు

తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. గత 24 గంటల్లో 1,23,005 మంది నమూనాలు పరీక్షించగా..కొత్తగా 1,362 కరోనా కేసులు నమోదయ్యాయి. 10మంది మృతి చెందారు.

Covid in Telangana: తెలంగాణలో కొత్తగా 1,362 కరోనా కేసులు, 10మంది మృతి, జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 145 కేసులు, రాష్ట్రంలో ప్రస్తుతం 18,568 యాక్టివ్‌ కేసులు
A resident gets tested for coronavirus in the Liwan District in Guangzhou in southern China (Photo: PTI)

తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. గత 24 గంటల్లో 1,23,005 మంది నమూనాలు పరీక్షించగా..కొత్తగా 1,362 కరోనా కేసులు నమోదయ్యాయి. 10మంది మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,556కి చేరింది. కరోనా నుంచి నిన్న 1,813 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,568 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 145 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని (Lockdown Lifted in Telangana) కేబినెట్ నిర్ణయించింది. లాక్‌డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ (TS Cabinet) ఆదేశించింది. కేబినెట్ తాజా నిర్ణయాలు ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి.

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 19, 2021 08:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).