బుధవారం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,319 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య (Corona cases in Telangana) 7,00,094 కాగా, మరణాల సంఖ్య 4,047 ఉంది. ఇక రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 6,77,708 ఉండగా, తాజాగా 474 మంది రికవరీ అయ్యారు. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 96.80 శాతం ఉంది. ఇక ఐసోలేషన్‌లో 18,339 మంది ఉన్నారు. రాష్ట్రంలో కరోనా ఆంక్షలను ఈనెల 20 వ‌ర‌కు పెంచ‌డంతో రోజువారీ కేసుల సంఖ్య (Corona cases in Telangana) కాస్త త‌గ్గే అవ‌కాశం కనిపిస్తోంది. ప్రజలంతా కరోనా నిబంధ‌న‌లు పాటిస్తే కేసుల సంఖ్యను అదుపులో ఉండే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)