తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య దాదాపు తగ్గు ముఖం పడుతోంది. ఈ రోజు కొత్తగా 92 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 36 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏడు జిల్లాల్లో జీరో కేసులు నమోదు కాగా…. తొమ్మిది జిల్లాల్లో ఒక్కోక్క కేసు చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈరోజు నమోదైన 92 కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,90,043 కి చేరింది. ఈరోజు కోవిడ్ నుంచి 151 మంది కోలుకున్నారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య7,84, 616కి చేరింది. రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 99.31 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,316 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఈ రోజు ఎటువంటి కోవిడ్ మరణాలు సంభవించలేదు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)