తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా మరోసారి ప్రధాని మోదీపై వ్యంగ్యం ప్రదర్శించారు. గత రెండు వారాల్లో.. దేశవ్యాప్తంగా దాదాపు 10రూ. పెరిగిన పెట్రో ధరలను ప్రస్తావిస్తూ కేటీఆర్‌ మంగళవారం ఉదయం ఓ ట్వీట్‌ చేశారు. దేశంలో జీడీపీ దూసుకెళ్లడం లేదని ఎవరన్నారు?. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు రోజూ పెంచుతూ.. జనాలకు దానిని ఒక అలవాటుగా మార్చినందుకు ప్రధాని మోదీగారికి ధన్యావాదాలు. బీజేపీలో మేధావులైన కొందరు నేతలు.. ఇప్పుడు ఇదంతా ఈవీ(ఎలక్ట్రిక్ వాహనాలను)లను ప్రమోట్‌ చేసేందుకు మోదీగారు చేస్తున్న మాస్టర్‌ స్ట్రాటజీ అని చెప్పుకుంటారు కూడా అని ట్వీట్‌ చేశారు కేటీఆర్‌.

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)