తన ఇంట్లో పని చేసే మహిళను బీజేపీ సస్పెండెడ్‌ నేత సీమా పాత్రా అత్యంత పైశాచికంగా హింసించిన వీడియో బయటకు వచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తనకు చదువుకోవాలని ఉందంటూ బాధితురాలు చెప్పిన వీడియో ఒక దానిని ప్రముఖ జర్నలిస్ట్‌ బర్ఖా దత్ పోస్ట్‌ చేశారు. ‘‘ఆమె పళ్లు విరిగిపోయాయి. ఎనిమిదేళ్లుగా నరకం అనుభవించింది. సీమాపాత్ర ఆమెను క్రూరంగా హింసించింది. కోలుకున్నాక చదువుకోవాలని బాధితురాలు చెబుతోంది’’ అంటూ దత్‌ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనికి ట్విటర్‌లో స్పందించారు కేటీఆర్‌.

తాను వ్యక్తిగతంగా ఆమె చదువుకు అవసరమయ్యే సాయం అందించేందుకు సిద్ధమని కేటీఆర్‌ పేర్కొన్నారు. అంతేకాదు ఆమె కుటుంబ సభ్యుల వివరాలను పంపాలంటూ బర్ఖా దత్‌ను కోరారాయన. కేటీఆర్‌ బదులును అభినందించిన దత్‌.. అలాగే చేద్దాం అంటూ బదులిచ్చారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)