తెలంగాణ గవర్నర్‌ తమిళిసై రాజకీయాలు మాట్లాడుతున్నారని.. ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు మావని.. మేము నామినేటెడ్‌ వ్యక్తులం కాదని మంత్రి అన్నారు. సీఎంతో పనిచేయడం ఇష్టం లేదని చెప్పడం సరికాదన్నారు. ఉప రాష్ట్రపతి, గవర్నర్‌ అనే రోల్‌ చాలా తక్కువ. గవర్నర్‌గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. రాజ్యాంగ పరమైన విధానంలో కాంగ్రెస్‌ స్టాండ్‌ ఏంటి?. ప్రతిపక్షాలకు పని పాట లేదు. పొద్దున లేస్తే సోషల్ మీడియాలో ప్రచారం తప్ప వేరే లేదంటూ’’ మంత్రి తలసాని మండిపడ్డారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)