మ‌హిళా ఐఏఎస్ అధికారిణి, ప్రస్తుతం తెలంగాణలో ములుగు జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్‌ త్రిపాఠి ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చారు. 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన త్రిపాఠి ములుగు జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ (స్థానిక సంస్థ‌లు)గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఈ జిల్లాకు పొరుగునే ఉన్న జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఆమె భ‌ర్త‌ భ‌వేశ్ మిశ్రా ప‌నిచేస్తున్నారు. త్రిపాఠికి సోమ‌వారం రాత్రి పురిటి నొప్పులు ప్రారంభం కాగా... ఆమెను భ‌వేశ్ మిశ్రా భూపాల‌ప‌ల్లిలోని ఏరియా ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.

ఈ విష‌యం తెలుసుకున్న ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ సంజీవ‌య్య ఆసుప‌త్రిలో ప‌నిచేస్తున్న గైన‌కాల‌జిస్ట్‌ల‌ను ర‌ప్పించారు. సాధార‌ణ ప్ర‌స‌వానికే వైద్యులు య‌త్నించ‌గా.. గ‌ర్భంలోని మ‌గ శిశువు బ‌రువు అధికంగా ఉండ‌టంతో సోమ‌వారం రాత్రి సిజేరియ‌న్ ఆప‌రేష‌న్ చేసిన వైద్యులు త్రిపాఠికి ప్ర‌స‌వం చేశారు. ప్ర‌స‌వం త‌ర్వాత త‌ల్లీబిడ్డ‌లు ఆరోగ్యంగా ఉన్న‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో స‌ర్కారీ ఆసుపత్రుల్లో పెరిగిన వ‌సతుల‌కు నిద‌ర్శ‌న‌మే ఈ ఘ‌ట‌న అని అధికార టీఆర్ఎస్‌కు చెందిన నేత‌లు చెబుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)