సూర్యాపేట జిల్లాలో టీఎస్‌ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ప్రయాణికులు బస్సులో నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేటలోని మొద్దులచెరువులోని ఇందిరా నగర్‌ వద్ద రాజధాని ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు.. రోడ్డుపై వెళ్తున్న స్కూటీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

బస్సు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. నడిరోడ్డుపై బస్సు నిలిచిపోవడంతో ఎన్‌హెచ్‌-65పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇక, బస్సును మియాపూర్‌ డిపోకు చెందినదిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న రాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, మృతుడు రాజును మునగాల మండలం ఇందిరానగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)