తెలంగాణ పోలీసు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. కానిస్టేబుల్‌ పరీక్షలను రెండు దఫాల్లో నిర్వహించనున్నట్టు బోర్డు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్‌ఐ రాత పరీక్షను ఆగస్టు 7వ తేదీన, కానిస్టేబుల్‌ పరీక్షను 27 తేదీల్లో నిర‍్వహించనున్నారు. ప్రిలిమ్స్‌ రాత పరీక్ష హాల్‌టికెట్లను www.tslprb.in ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూలై 30వ తేదీ నుంచి ఎస్‌ఐ, ఆగస్టు 10వ తేదీ నుంచి కానిస్టేబుల్‌ అభ్యర్థులు హాట్‌ టికెట్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. కాగా, ఈ పరీక్షలకు సుమారు 8.95 లక్షల మంది హాజరుకానున్నారు.

Telangana Police Constable Prelims Exam Date 2022

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)