దేశ రాజకీయాల్లో మరో జాతీయ పార్టీ ఆవిర్భవించింది.తెలంగాణ సీఎం కేసీఆర్ నూతన జాతీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ ఆయన అధికారిక ప్రకటన చేశారు. టీఆర్ఎస్ పేరును మారుస్తూ ఇవాళ నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ తీర్మానంపై సంతకం చేశారు. దీంతో 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటు చేసుకుంది. సుమారు 8 రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా ఇవాళ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Telangana Rashtra Samithi (TRS) renamed as 'Bharat Rashtra Samithi' (BRS).
The decision to rechristen TRS to BRS has been taken in the General body meeting. A resolution has been passed by TRS General Body.
Party workers celebrate the decision. pic.twitter.com/AU4CXoy3db
— ANI (@ANI) October 5, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)