తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కమిషనర్లను బదిలీ చేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.హైదరాబాద్ నూతన సీపీగా కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి (Hyderabad CP Kotha kota Srinivasreddy) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాచకొండ సీపీగా సుధీర్ బాబు (Rachakonda CP Sudhirbabu), సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి (Syberabad CP Avinash Mahanti) నియమితులయ్యారు. అలాగే హైదరాబాద్ పాత సీపీ సందీప్ శాండిల్యాను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీ చౌహన్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
కొత్త సీపీలు వీరే..
రాచకొండ సీపీ.. సుధీర్‌బాబు
హైదరాబాద్ సీపీ.. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
సైబరాబాద్ సీపీ.. అవినాశ్ మహంతి
తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్.. సందీప్ శాండిల్యా
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)