నిన్న వెలువడిన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో ఒక్కరోజే ఏడుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్మిడియెట్ పరీక్షల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఫెయిలైన ఏడుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడగా, ఫెయిలవుతాననే భయంతో సిద్దిపేట జిల్లా మర్కక్ మండలం పతూరు గ్రామానికి చెందిన ఒకేషనల్ ఫస్టియర్ విద్యార్థిని శ్రీజ ఫెయిలైతే అందరి ముందు అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి బలవన్మరణం పొందింది.

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్‌కు చెందిన సాయితేజ గౌడ్ (17), హైదరాబాద్ అత్తాపూర్‌కు చెందిన హరిణి, మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచ్చులాపూర్ గ్రామానికి చెందిన మైదం సాత్విక్, మంచిర్యాల జిల్లా దొరగారిపల్లెకు చెందిన గట్టిక తేజస్విని, ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన వాగదాని వైశాలి, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన చిప్పా భార్గవి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఆయా విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)