హైదరాబాద్‌లో బోడుప్పల్‌లోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో డ్యాన్స్ మాస్టర్ రవి ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆ టీచర్ ను చితకబాదారు. డ్యాన్స్ టీచర్ రవిని కిందపడేసి తన్నారు. స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. తమకు ఫిర్యాదు చేయాలని, ఇలా దాడి చేయడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులను ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. పిల్లల్ని బడికి పంపాలంటేనే భయమేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆ టీచర్ తో పాటు, పాఠశాల ప్రిన్సిపాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దారుణం, ఊయలలో పడుకున్న ఆరు నెలల పసిపాపపై అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు
Here's Video
ఒకటో తరగతి చదువుతున్న చిన్నారిపై డాన్స్ టీచర్ లైంగిక దాడి
డ్యాన్స్ టీచర్‌ను చితకబాదిన చిన్నారి పేరెంట్స్
మేడ్చల్ - బోడుప్పల్ కిరణ్ ఇంటర్నేషల్ స్కూల్‌లో ఒకటో తరగతి చిన్నారిని లైంగిక వేదింపులు చేసిన డ్యాన్స్ టీచర్.. pic.twitter.com/bHPnzFGj77
— Telugu Scribe (@TeluguScribe) July 15, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)