సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బులు కోసం కన్నతల్లి అంత్యక్రియలు జరగకుండా కొడుకు, కూతుళ్లు వదిలేశారు. కందువారిగూడెంకు చెందిన లక్ష్మమ్మకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్నకుమారుడు కొన్నాళ్లు క్రితమే చనిపోయాడు. కాగా, ఇటీవల లక్ష్మమ్మ ఇటీవల బాత్‌రూంలో జారిపడి ఆసుప్రతిలో చేరింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

అయితే ఆమె వద్ద ఉన్న రూ.20 లక్షలు ముగ్గురు కూతుళ్లు సమానంగా పంచుకున్నారు. అయినా అంత్యక్రియల విషయంలో పేచీ పెట్టారు. అంత్యక్రియలు జరపకుండా మృతదేహాన్ని ఇంటివద్దే ఉంచారు. తండ్రితో పాటు తమ్ముడి అంత్యక్రియలు తానే చేశానని పెద్దకొడుకు చెబుతున్నాడు. తన తల్లి లక్ష్మమ్మ డబ్బు, బంగారం కూతుళ్లకే ఇచ్చిందని ఆరోపిస్తున్నాడు.  వీడియో ఇదిగో, విద్యుత్ షాక్‌తో ఆగిన ఆరేళ్ల బాలుడి గుండె, సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మహిళా డాక్టర్

తాను ఇప్పటికే కూలినాలి చేసుకుని బతుకుతున్నానని.. ఖర్చు తాను భరిస్తే తన పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. అయితే. తల్లి అంత్యక్రియల విషయంలో కుమారుడు, కూతుళ్లు గొడవపడటం పట్ల గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు కని పెంచి ప్రయోజకుల్ని చేసిన తర్వాత ఇలా తల్లి శవాన్ని ఇంటి ముందు పెట్టుకుని ఘర్షణ పడటం తగదని సూచిస్తున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)