పెద్దపల్లి జిల్లా(Peddapally district) సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశా లలో మన్విత్ అనే ఆరో తరగతి విద్యార్థిని పాము కాటు(Snake bite) వేసింది. మన్విత్‌ను గురుకుల సిబ్బంది కరీంనగర్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. జూలపల్లి మండలానికి చెందిన మన్విత్ మధ్యాహ్న భోజన సమయంలో ప్రకృతి పిలుపు మేరకు బయటకు వెళ్లినప్పుడు పాము కాటుకు గురయ్యాడు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది 108 అంబులెన్స్‌లో కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. వీడియో ఇదిగో, గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై దాడి, ఆందోళనకు సిద్ధమవుతున్న జూనియర్ డాక్టర్లు
Here's Video
గురుకుల పాఠశాలలో విద్యార్థికి పాము కాటు
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మన్విత్ అనే ఆరో తరగతి విద్యార్థికి పాము కాటు.
కరీంనగర్ ఆసుపత్రికి తరలింపు pic.twitter.com/XxLuOnOclY
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)