నల్లగొండ పట్టణంలోని రాజీవ్ పార్కులో మంగళ వారం డిగ్రీ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నార్కట్పల్లి మండలంలోని నక్కలపల్లికి చెందిన దొంతరబోయిన శివాని, అదే మండలంలోని అమ్మనబోలు గ్రామానికి చెందిన అనుగూతల మనీష ఇంటర్మీడి యట్ నుంచి స్నేహితులు కాగా వారు ఎస్సీ హాస్టల్లో ఉంటూ నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.
గత 20 రోజులుగా ఇంటి వద్దనే ఉన్న వీరిద్దరు కళాశాలకు వెళ్తామని కుటుంబ సభ్యులకు చెప్పి మంగళవారం ఉదయం బస్సులో నల్లగొండకు వచ్చి ఎన్జీ కళాశాల వెనుక ఉన్న రాజీవ్ పార్కులోకి ఇద్దరూ వెళ్లి గడ్డి మందు తాగి పార్కు గేట్ వద్దకు వచ్చి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు.ఇన్స్టాగ్రాంలో కొందరు తమను బెదిరించారని చెప్పగా వారిద్దరి ఫోన్లను పోలీసులు పరిశీలించగా ఇన్స్టాగ్రాంలో ఎవరూ వారిని వేధించలేదని నిర్ధారించారు.
వారి ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా.. ఇద్దరు విద్యార్థినులు మధ్యే ఎక్కువగా ఫోన్ సంభాషణ ఉన్నట్లు తెలిసింది. వారి బ్యాగులో నిద్రమాత్రలు లభించాయి. విద్యార్థినులిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Here's Video
పురుగుల మందు తాగి ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు మృతి
నల్లగొండ పట్టణంలోని రాజీవ్ పార్కులో మంగళ వారం డిగ్రీ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
నార్కట్పల్లి మండలంలోని నక్కలపల్లికి చెందిన దొంతరబోయిన శివాని, అదే మండలంలోని అమ్మనబోలు… pic.twitter.com/MqfVC3hjkG
— Telugu Scribe (@TeluguScribe) September 6, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)