తెలంగాణలో విజయ డైయిరీ పాల ధరలు పెరిగాయి. లీటరు టోన్డ్ మిల్క్ పై రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ప్రకటించింది. దీంతో పాటుగా హోల్ మిల్క్ ధర ధర కూడా రూ.4 పెంచింది. ఈ పెంచిన ధరలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. పాల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ధరలు పెంచుతున్నామని సంస్థ తెలిపింది. ధరలు పెరిగిన దృష్ట్యా వినియోగదారులంతా సహకరించాలని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ జనరల్ మేనేజర్ వి. మల్లిఖార్జున్ రావు విజ్ఞప్తి చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)