Hyderabad, Sep 12: సికింద్రాబాద్‌ (Secunderabad) గాంధీ వైద్యకళాశాలలో (Gandhi Hospital) ర్యాగింగ్‌ (Ragging) కలకలం రేపింది. కళాశాలలో ఎంబీబీఎస్ (MBBS) మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్‌ చేసిన ఘటనలో పది మంది సీనియర్‌ విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు. కొత్తగా చేరిన విద్యార్థులను కొంతమంది సీనియర్లు రాత్రిళ్లు హాస్టల్‌ గదులకు పిలిపించి వారం నుంచి ర్యాగింగ్ చేస్తున్నారు. దీనిపై బాధితులు కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీతోపాటు  యూజీసీ యాంటీ ర్యాగింగ్‌ సెల్‌ కు ఫిర్యాదు చేశారు. అంతర్గత విచారణలో పది మంది సీనియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ చేసినట్లు నిర్థారణ కావడంతో వారిని కళాశాల, వసతిగృహం నుంచి సస్పెండ్‌ చేసినట్లు వైద్యవిద్య డైరెక్టర్‌ రమేశ్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Nipah Virus: డేంజర్ బెల్స్.. కరోనా విలయం పూర్తయిందో లేదో.. మరో భయం.. కేరళలో రెండు అసహజ మరణాలు.. నీపా వైరస్ కారణమని అనుమానాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)