తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. భారత రాష్ట్ర సమితి జెండాను ఆ పార్టీ అధినేత,సిఎం కెసిఆర్ ఆవిష్కరించారు. జెండాను ఆవిష్కరించిన సమయంలో తెలంగాణ భవన్ పటాకులు, డప్పులతో దద్ధరిల్లిపోయింది. జై కెసిఆర్, జై భారత్ నినాదాలు మార్మోగాయి. జెండా ఆవిష్కరణ కంటే ముందు బిఆర్ఎస్ పత్రాలపై కెసిఆర్ సంతకం చేశారు.
అంతకు ముందు ముందు భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వచనాలు కెసిఆర్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జేడీఎస్ చీఫ్ కుమార స్వామి, సినీ నటుడు ప్రకాశ్ రాజ్, ఆయా రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Here's TRS Party Tweet
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ https://t.co/ougzhLu5yK
— TRS Party (@trspartyonline) December 9, 2022
సీఎం కేసీఆర్ గారికి జేడీఎస్ చీఫ్ శ్రీ కుమారస్వామి, శ్రీ ప్రకాశ్ రాజ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. pic.twitter.com/Awbah97oZW
— TRS Party (@trspartyonline) December 9, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)