పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేప‌థ్యంలో ఈ రోజు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌సంగించిన విష‌యం తెలిసిందే. అయితే, తెలంగాణ‌ సీఎం కేసీఆర్ నిర్దేశం మేరకు రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. తెలంగాణ ప‌ట్ల‌ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ద‌ర్శిస్తోన్న తీరుకి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బ‌హిష్కరించిన‌ట్లు టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. విభజన హామీలతో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, జీఎస్టీ నిధులు విడుద‌ల చేయాల‌ని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో టీఆర్ఎస్ ఎంపీలు నిరస‌న తెలిపారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై పోరాడ‌తామ‌ని తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)