పదో తరగతి పేపర్‌ లీక్‌ వ్యవహారంలో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే సంజయ్‌పై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని డిమాండ్‌​ చేస్తున్నారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా సంచలన కామెంట్స్‌ చేశారు.

పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం...!! కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం...!!! తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Here's KTR Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)