తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. ప్రిలిమ్స్ రద్దును సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రిలిమ్స్‌ను మళ్లీ నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది.
గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్ నిర్వహించగా.. ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో ఆ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. మళ్లీ ఈ ఏడాది జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా.. ఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చింది. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దు అయ్యింది.
Here's News
హైదరాబాద్: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను సమర్థించిన హైకోర్టు డివిజన్ బెంచ్#Telangana…
— NTV Breaking News (@NTVJustIn) September 27, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)