సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ డ్రైవర్ మీద బైకర్ దాడి చేసిన వీడియో వైరల్ అయిన సంగతి విదితమే. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మండిపడ్డారు. నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిపై విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదని అన్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద బైకర్‌ నిర్లక్ష్యంగా నడపి ప్రమాదానికి కారణమయ్యాడు. అయినా తన తప్పేం లేదన్నట్టు తిరిగి టిఎస్‌ఆర్టీసీ హైర్‌ బస్‌ డ్రైవర్‌పై దాడి చేశారు. దుర్బాషలాడుతూ విచక్షణరహితంగా కొట్టారు. దీనిపై సజ్జనార్ ట్వీట్ చేస్తూ..ఈ ఘటనపై అందోల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుందని సజ్జనార్‌ పేర్కొన్నారు.

Here's Sajjanar Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)