సోషల్ మీడియా మత్తులో పడి యువతి యువకులు బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని ఆర్టీసీ చైర్మన్, ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ లో ఓ షాకింగ్ వీడియో అప్ లోడ్ చేశారు. ఓ యువకుడు తన స్నేహితురాలిని బైక్ వెనక కూర్చోబెట్టుకొని స్టంట్స్ చేస్తు కింద పడిన ఘటన వైరల్ గా మారింది. దీనిపై సజ్జనార్ స్పందిస్తూ, లైక్ లు, కామెంట్ల కోసం ప్రమాదకర స్టంట్స్చే యకండి. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండి. సోషల్ మీడియా లో పాపులారిటీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను మనో వేదనకు గురిచేయకండని పేర్కొన్నారు.
యువతీయువకులారా...! సోషల్ మీడియా మత్తులో పడి బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోకండి. లైక్ లు, కామెంట్ల కోసం ప్రమాదకర స్టంట్స్ అసలే చేయకండి. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండి. సోషల్ మీడియా లో పాపులారిటీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. మీ… pic.twitter.com/ktQ7kWxqbP
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 19, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)