తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు వరంగల్ జిల్లా పాలకుర్తి(Palakurthy) ప్రజలు. రేవంత్‌ని నమ్మి మోసపోయినం మళ్లీ 20 ఏండ్ల దాకా రేవంత్ రెడ్డి గెల్వడు అని తెగేసి చెబుతున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakarrao)తో తమ గోస వెళ్ళబుచుకున్నారు పెన్షన్ దారులు.
మరోవైపు తెలంగాణ(Telangana) వ్యాప్తంగా జరుగుతున్న గ్రామసభల్లో ప్రజల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ సభలో తాజా మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం నడుకుడా గ్రామంలో అధికారులతో గ్రామ సభలో వాగ్వాదానికి దిగారు. హుజురాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)పై టొమాటోలతో దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య జరిగిన మాటల యుద్దం జరిగింది. బీఆర్ఎస్ నాయకులపై టొమాటోలు విసిరారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో అధికారులను గ్రామ సభలో నిలదీశారు గ్రామస్థులు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి షాక్..కోడి గుడ్లతో దాడి, కమలాపూర్‌లో ఘటన,వ్యవసాయ అధికారికి తగిలిన కోడి గుడ్డు.. వీడియో
Warangal People angry on cm Revanth Reddy
నమ్మి మోసపోయినం మళ్లీ 20 ఏండ్ల దాకా రేవంత్ రెడ్డి గెల్వడు
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో తమ గోస వెళ్ళబుచుకున్న పెన్షన్ దారులు pic.twitter.com/GWMKovy9n5
— Telugu Scribe (@TeluguScribe) January 24, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)