Vijayawada, Jan 6: విజయవాడ (Vijayawada) ఎంపీ (MP) అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు (Chandrababu) తనతో చెప్పారని శుక్రవారం మీడియాకు తెలిపిన టీడీపీ నేత కేశినేని నాని (Kesineni Nani) నేడు (శనివారం) సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ ని కలిసి తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నానంటూ ‘ఎక్స్’, ‘ఫేస్ బుక్’ వేదికగా పోస్టు పెట్టారు. ఆయన పోస్టు వివరాలు ఇలా..
చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన
కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను . pic.twitter.com/dFq85E4SxG
— Kesineni Nani (@kesineni_nani) January 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)