ఉద్యోగాలు ఊడుతున్న వేళ హెచ్‌సీఎల్ టెక్ గుడ్ న్యూస్ తెలిపింది. రాబోయే రెండేళ్లలో రొమేనియాలో 1,000 మంది ఉద్యోగులను నియమించు కోనున్నట్లు ప్రకటించింది. రొమేనియాలో తన కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ రోమేనియన్ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ద్వారా మూడో వంతు చోటు కల్పించనుంది. ఇప్పటికే దేశంలో దాదాపు 1,000 మంది ఉద్యోగులుండగా, మరో వెయ్యిమందిని చేర్చుకోనుంది.
ఐటీ సేవల్లో వృద్ధిని కొనసాగించేందుకు స్థానిక ప్రతిభావంతులకు మరిన్ని అవకాశాలను సృష్టించేందుకు కంపెనీ బుకారెస్ట్, ఇయాసిలో ఉద్యోగులను పెంచుకుంది. కాగా గూగుల్, అమెజాన్ , మెటా గత ఏడాది చివర్లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించినసంగతి తెలిసిందే. గూగుల్ 12వేలు, మెటా, అమెజాన్‌లు వరుసగా 21వేలు, 27వేల మంది ఉద్యోగాలపై వేటు వేశాయి.
Here's News
#Google, #Meta and #Amazon are firing employees but this Indian company has different planshttps://t.co/mR89Cyjd10
— Business Today (@business_today) March 31, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)