బ్రిటన్ లోని ప్రముఖ రీటైలర్‌ సంస్థ విల్కో భారీ న‌ష్టాల్లో కూరుకుపోయింది. కార్యకలాపాలకు నిధుల లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో అందులో ప‌నిచేస్తున్న 12 వేల మంది ఉద్యోగాలు ప్ర‌మాదం పడ్డాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, విల్కో యూకే దాదాపు 400 స్టోర్లతో పాటు 12,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.

అయితే 2021 డిసెంబర్‌లో ప్రారంభమైన వడ్డీ రేట్ల పెంపుల పెంపు, రిటైలర్ బ్రిటన్‌లోని ఆర్థిక పరిస్థితుల ప్రభావం, పరిస్థితుల అనుగుణంగా వ్యాపారాన్ని నడపలేకపోవడం కారణంగా ఈ సంస్థ వ్యాపారం క్షీణిస్తూ వచ్చింది.విల్కో ఇప్ప‌టికే రీస్ట్ర‌క్చ‌రింగ్ సంస్థ హిల్కో నుంచి 40 మిలియ‌న్ పౌండ్ల‌ను రుణంగా తీసుకుంది. ఆ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఉద్యోగాల్లో కోత‌, యాజ‌మాన్యంలో మార్పుల‌ను చేయాల్సి ఉంటుంది. మరి కష్టాల నుంచి గట్టెక్కుతుందా లేదా అనేది చూడాలి.

Budget retailer Wilko on brink of collapse with 12,000 jobs at risk

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)