మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో ఉన్న లింక్డ్‌ఇన్ రిక్రూట్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుండి ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం ఇందులో ఎంత మంది ఉద్యోగులను తొలగించింది అనే దాని మీద ఎటువంటి స్పష్టమైన సమాచారం అందివ్వలేదు.2023 ప్రారంభంలో టెక్ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన చాలామందికి ఉద్యోగావకాశాలు కల్పించిన లింక్డ్‌ఇన్ (LinkedIn) ఇప్పుడు ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో టెక్ ప్రపంచం షాక్ కి గురవుతోంది. కాగా 2023 ప్రారంభంలోనే 10 వేల మందిని తొలగించినట్టుగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్వయంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం తొలగించిన ఉద్యోగుల సంఖ్య, తొలగించడానికి గల కారణాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
Here's Update
LinkedIn begins layoffs in recruitment department
Link 👉https://t.co/G1INPc7w3g
— Indian HR Blog (@IndianHRBlog) February 14, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)