ఇస్రో చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ సక్సెస్ తో లక్ష్యానికి దగ్గరైంది. చంద్రుడి ఆవరణంలో చివరిది, ఐదవది అయిన కక్ష్య తగ్గింపు ప్రక్రియను కూడా ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం ఉదయం 8.30 గంటలకు విజయవంతంగా పూర్తిచేశారు. దాంతో ప్రస్తుతం చంద్రుడి చుట్టూ ఉన్న 153 కిలోమీటర్లు X 163 కిలోమీటర్ల కక్ష్యలోకి స్పేస్‌క్రాఫ్ట్‌ తిరుగుతున్నది.

మరో వారం రోజుల్లో చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా చుంద్రుడి ఉపరితలంపై దిగనుంది. రేపు (ఆగస్టు 17న) స్పేస్‌క్రాఫ్ట్‌లోని ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోతుందని ఇస్రో సైంటిస్టులు ప్రకటించారు. ఆ తర్వాత క్రమంగా ల్యాండర్‌ మాడ్యూల్‌ వేగాన్ని తగ్గిస్తూ చంద్రుడి ఉపరితలంపై దించనున్నారు. చంద్రయాన్‌-2 సందర్భంగా ల్యాండింగ్‌ దగ్గరే ప్రయోగం విఫలమైంది. ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో ల్యాండర్‌ చందమామపై దిగే అవకాశం ఉన్నది.

Here's ISRO Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)