ఇటీవ‌ల చంద్రుడుపై అధ్యనం కోసం ర‌ష్యా చేప‌ట్టిన లూనా-25(Luna-25) మిష‌న్‌ చంద్రుడిపై కూలిన సంగతి విదితమే. ఆ కూలిన ప్రాంతంలో ఆ స్పేస్‌క్రాఫ్ట్ ధాటికి సుమారు 10 మీట‌ర్ల విస్తీర్ణంలో గొయ్యి ఏర్పడిన‌ట్లు నాసా వెల్ల‌డించింది.లూనా-25 కూలిన ప్రాంతంలో ఏర్ప‌డిన అగాధం గురించి నాసాకు చెందిన లూనార్ రిక‌న్నైసెన్స్ ఆర్బిటార్ ఫోటోల‌ను రిలీజ్ చేసింది.

ఆ గొయ్యి సుమారు 10 మీట‌ర్ల విస్తీర్ణంలో ఉన్న‌ట్లు నాసా తెలిపింది. లూనా-25 దిగాల్సిన పాయింట్ స‌మీపంలో ఆ గొయ్యి ఉంద‌ని, అయితే ఆ గొయ్యి లూనా వ‌ల్లే ఏర్ప‌డిన‌ట్లు ఎల్ఆర్వో టీమ్ భావిస్తున్న‌ట్లు నాసా చెప్పింది. మ‌రో వైపు లూనా-25 విఫ‌ల‌మైన అంశంపై ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు ర‌ష్యా ప్ర‌త్యేక క‌మీష‌న్ ఏర్పాటు చేసింది.

Luna-25 crash site on Moon

Here's Photos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)