ప్రపంచ మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనంతస్థాయిలో Facebook కంపెనీ మార్కెట్‌ విలువ నిమిషాల్లో హరించుకుపోయింది. అమెరికాలో గురువారం మార్కెట్‌ ప్రారంభ క్షణాల్లోనే ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌ షేర్లు 25 శాతం కుప్పకూలాయి. దీంతో ఈ కంపెనీ మార్కెట్‌ విలువ ఒక్కసారిగా 200 బిలియన్‌ డాలర్లకు పైగా (దాదాపు రూ. 15 లక్షల కోట్లు) పడిపోయింది. 2022 జనవరి-మార్చి క్వార్టర్లో ఆదాయ వృద్ధి తగ్గుతుందంటూ హెచ్చరించడంతో ఇన్వెస్టర్లు ఈ షేర్లను తెగనమ్మారు.

ఫలితంగా మెటా షేరు 25 శాతంపైగా పతనమై 52 వారాల కనిష్ఠస్థాయి 237 డాలర్ల వద్దకు పడిపోయింది. ఈ స్థాయి వద్ద కంపెనీ మార్కెట్‌ విలువ 688 బిలియన్‌ డాలర్లు. ఈ విలువ 880 బిలియన్‌ డాలర్ల నుంచి నిలువునా 200 బిలియన్‌ డాలర్ల మేర తగ్గిపోయింది. క్రితం రోజు ఈ షేరు 323 డాలర్ల వద్ద ముగిసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)