ఇన్‌‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్‌చాట్‌’ (SnapChat) మాతృ సంస్థ ‘స్నాప్’ (Snap) ఫ్రెష్‌ లేఆఫ్స్‌ ప్రకటించింది. గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఉద్యోగుల తొలగింపు విషయాన్ని వెల్లడించింది.సంస్థలో 5,367 మంది ఫుల్‌టైమ్‌ ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ తాజా నిర్ణయంతో 540 మంది ఉద్యోగులు కొలువుల్ని కోల్పోనున్నారు. వ్యయాల తగ్గింపు ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. స్నాప్‌తోపాటు ఓక్టా ఇన్ (Okta Inc ) సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా ఈ నెల ప్రారంభంలోనే లేఆఫ్స్‌ ప్రకటించింది. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడానికి సిబ్బందిలో ఏకంగా 7 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ నిర్ణయంతో 400 మంది ఉద్యోగులు కొలువులు కోల్పోనున్నారు.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)