దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో టెక్ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. శ్రామిక శక్తిని తగ్గించుకుంటూ రెవిన్యూను పెంచుకునే మార్గంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో టెక్ ఉద్యోగాలకు భరోసా అనేది కరువయింది. ఒక్క జనవరి నెలలోనే 50 వేల  మందికి పైగానే ఉద్యోగులను టెక్ కంపెనీలు ఉద్యోగం నుండి తీసివేశాయి. వీటిలో Amazon, Google, Dell, IBM, Microsoft వంటి టాప్ కంపెనీలు ఉన్నాయి.

టెక్ దిగ్గజం IBM గత నెలలో 3,900 మంది ఉద్యోగులను తీసేసింది. ఇక డెల్ 6,650 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అమెజాన్ 18 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపగా..మైక్రోసాఫ్ట్ 10 వేల మంది ఉద్యోగులకు బైబై చెప్పింది. ఇక సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ 12 వేల మంది ఉద్యోగులకు జనవరి నెలలో ఉద్వాసన పలికింది.

Tech Layoffs 2023 (Photo-File Image)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)