ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్ లోని న్యూఢిల్లీ, ముంబై నగరాల్లోని ఆఫీసులను మూసి వేశారు. భారతదేశంలోని తన మూడు కార్యాలయాలలో రెండింటిని మూసివేసిన సంస్థ సిబ్బందిని ఇంటినుంచే పనిచేయమని కోరింది. బెంగళూరు కార్యాలయం ప్రస్తుతం యథాతథంగా కొనసాగనుందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఎలాన్ మస్క్ కంపెనీని చేజిక్కించుకున్నప్పటినుంచి 90 శాతం ఉద్యోగులను తొలగించిన ట్విటర్ ఢిల్లీ, ముంబైలోని తన కార్యాలయాలను మూసివేయడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఇండియాలో సుమారు 200 మంది సిబ్బందిలో 90శాతం మందిని తొలగించిన విషయం తెలిసిందే. ట్విటర్ బెంగళూరులో కార్యాలయాన్ని కొనసాగిస్తోందని, ఇది ప్రధానంగా ఇంజనీర్లతో పని చేస్తుందని వర్గాలు వెల్లడించాయి.
Here's Update
Twitter Offices in Delhi and Mumbai Ordered To Shut Amid Layoff Fears; Staff Told To Work From Home@Twitter#Twitter #TwitterOffices #WorkFromHome #TwitterOfficesShut #Mumbai #Delhi https://t.co/8ZuTnfgFWA
— LatestLY (@latestly) February 17, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)