అమెరికాలో మంకీపాక్స్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు యుఎస్‌లో 31 మంది చిన్నారులకు మంకీపాక్స్ సోకింది.యుఎస్‌లోని 11 రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయని స్థానిక మీడియా పేర్కొన్నది. కాగా, అగ్రరాజ్యంలో మొత్తం 18,989 మంకీపాక్స్ కేసులు రికార్డయ్యాయని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిర్ధారించింది.
ప్రపంచంలోనే అత్యధికంగా మంకీపాక్స్ కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. కాగా, దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో మూడో వంతు కేవలం న్యూయార్క్ నగరంలోనే ఉండడంతో హాట్ స్పాట్ గా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 80కిపైగా దేశాల్లో మంకీ పాక్స్ కేసులు నమోదవుతున్నాయి.
More than 30 children in the United States have tested positive for monkeypox, according to local media citing officials.https://t.co/ke0Y87bEvp
— Mint (@livemint) September 2, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)